- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ ప్రజలకు తెలంగాణలోనూ ఓట్లున్నయ్: కాంగ్రెస్
దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంత మందికి హైదరాబాద్‌తో పాటు ఆ రాష్ట్రంలోనూ ఓట్లు ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు అన్నారు. అంతేగాక తెలంగాణ జిల్లాలతో పాటు చాలామందికి హైదరాబాద్‌లోనూ ఓట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, కానీ హైదరాబాద్‌లో బోగస్, డూప్లికేట్ ఓట్లతో పాటు మృతులకూ ఓట్లు ఉన్నాయని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ చెక్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. గతంలోనే తాము ఈసీ దృష్టికి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందన్నారు. హైదరాబాద్‌లో 0.7 శాతం పోలింగ్ తగ్గిందన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నుంచి పబ్లిక్ సొంత ప్లేస్‌లకు వెళ్లడం వలనే పోలింగ్ తగ్గినట్లు అర్ధమవుతుందన్నారు. ఏఎస్‌డీ లిస్టులో ఎంత మంది ఉన్నారు? అని అడిగితే గోప్యతకు భంగం కలుగుతుందని అధికారులు ఇవ్వలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గాలలో పోలింగ్ తక్కువ జరగడానికి కారణాలపై ఈసీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. అధ్యయనం చేసి తప్పులను దొరకపట్టాలన్నారు. వెంటనే ఆంధ్ర, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఓట్లు వేసిన వాళ్లకు హైదరాబాద్‌లో ఓటును తొలగించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయితీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయని, ఇప్పుడు తొలగిస్తేనే ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగే ఛాన్స్ ఉండదన్నారు.