- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Jagga Reddy : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరో సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. పొలిటికల్ మైండ్ బ్లాక్‌లో ఉన్నానని తెలిపారు. నేను ఎందుకు షాక్ అయ్యానో సమయం వచ్చినప్పుడు చెబుతా అని అన్నారు. ఆల్రేడీ రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరాను. కుసుమ కుమార్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)కి చెప్పాను.. ఇదే విషయం హైకమాండ్‌కు కూడా చెబుతానని కూడా వారితో చెప్పినట్లు వెల్లడించారు. కానీ ఢిల్లీలో ఇప్పటివరకు ఎటువంటి సమావేశం జరుగలేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఇప్పుడు తాను ఎవరినీ నిందించదలుచుకోలేదని.. గెలుపోటములను స్వీకరిస్తా కాబట్టే నిత్యం సంతోషంగా ఉంటానని అన్నారు.
తనకు సింపతీ రాజకీయాలు నచ్చవు.. తనది పోరాడే మనస్తత్వం అని అన్నారు. ఇక నుంచి రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ కొనసాగుతా.. ఇక్కడ, అక్కడ ఎక్కడా ఎవరూ తొక్కలేరు అని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తన పాత్రలో తానే నటిస్తూ.. సినీ రంగ ప్రవేశం చేస్తున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. తన పేరుతోనే “జగ్గారెడ్డి – ఎ వార్ ఆఫ్ లవ్”(Jagga Reddy – A War of Love) టైటిల్‌తో సినిమా తీస్తున్నట్టు చెప్పారు. అదొక ప్రేమ కథ చిత్రమని, అందులో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నానని వెల్లడించారు. మాఫియాను ఎదిరించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తిగా తాను సినిమాలో కనిపిస్తానని అన్నారు.