- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరవై రోజులు జర భద్రం.. స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా మస్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే 20 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ లీడర్లు, కేడర్‌కు కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఈవీఎం బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా ఉంచాలని నొక్కి చెప్పింది. అభ్యర్థులు, ఇన్‌ఛార్జ్‌లు నిత్యం మానిటరింగ్ చేయాలన్నారు. ప్రతీ రోజు విజిట్ చేయాలని టీపీసీసీ ఆదేశాలిచ్చింది. స్ట్రాంగ్ రూమ్‌ల బయట కూడా పార్టీ కీలక నేతలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. మూడు షిప్టులలో గమనించాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ వివరించింది. ఎన్నికలు పూర్తయ్యాయనే నిర్లక్ష్యంతో ఉండకుండా ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌లపై కూడా ఫోకస్ పెట్టాలని పార్టీ పేర్కొన్నది.
ఈ మేరకు టీపీసీసీ వార్ రూమ్ నుంచి పలు సలహాలు, సూచనలు ఇచ్చింది. పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ, పార్టీ నేతలు కూడా స్ట్రాంగ్ రూమ్‌లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పార్టీ గుర్తు చేసింది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అనుమానితులు కనిపిస్తే వెంటనే అధికారులు, ఈసీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఇందుకోసం టీపీసీసీ ఎన్నికల కో-ఆర్డినేటర్లతో సమన్వయం కావాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే తెలియజేయాలని టీపీసీసీ ఆదేశాలిచ్చింది.