- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్: కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించని 19 స్థానాలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ ఎట్టకేలకు ఇవాళ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను ఏఐసీసీ రిలీజ్ చేసింది. కాగా, ఫస్ట్ లిస్ట్‌లో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఇవాళ విడుదల చేసిన సెకండ్ లిస్ట్‌లో 45 మందిని ఖన్ఫార్మ్ చేసింది. దీంతో, రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ తాజా సెకండ్ లిస్ట్ విడుదలతో 100 నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఫిక్స్ చేసింది.
మిగిలిన 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, ఈ 19 స్థానాల్లో తీవ్రమైన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ.. వామపక్షాలు, కోదందరామ్ టీజేఎస్ పార్టీతో పొత్తుల నేపథ్యంలో ఈ స్థానాలను కాంగ్రెస్ హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. వామపక్షాలు, టీజేఎస్‌కు కేటాయించే సీట్లపై క్లారిటీ వచ్చిన తర్వాత మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన 19 స్థానాలతో కాంగ్రెస్ మూడవ లిస్ట్ విడుదల కానున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించని 19 సెగ్మెంట్‌లు ఇవే:
1. వైరా
2.కొత్తగూడెం
3.మిర్యాలగూడ
4.చెన్నూరు
5. చార్మినార్
6.నిజామాబాద్ అర్బన్
7.కామారెడ్డి
8. సిరిసిల్ల
9.సూర్యపేట
10.తుంగతుర్తి
11.బాన్సువాడ
12.జుక్కల్
13.పఠాన్ చెరువు
14.కరీంనగర్
15.ఇల్లందు
16.డోర్నకల్
17.సత్తుపల్లి
18.నారాయణ్ ఖేడ్
19.అశ్వారావుపేట