MP Konda Vishweshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |
MP Konda Vishweshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అన్ని రంగాల్లో విఫలమైందని చేవెళ్ల బీజేపీ( BJP) ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (MP Konda Vishweshwar Reddy)విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆయన స్పందించారు. కాళేశ్వరం పేరుతో రాష్ట్ర వనరులను దోచుకున్న పాతోడు పోయిండని, కొత్తోడు వచ్చిండని అంతే తప్పా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ దివాళా తీయించిన రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచిన అమలు చేయలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో తమ పార్టీ ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు రాజకీయ విమర్శలతో కొట్టినట్టు, తిట్టినట్టు డ్రామాలు వేస్తున్నాయన్నారు. ఇప్పటిదాక బీఆర్ఎస్ పాలకులు చేసిన అక్రమాలపై చర్యలు లేవన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు సంబరాలు చేసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ఏడాది సంబరాలు ఎలాగో అలా ఏడాది గడిచిపోయిందని ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని చురకలేశారు. నిజానికి రైతులు అంతో ఇంతో సంతోషంగా ఉన్నారంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సహాయం, 23వేల కోట్ల ఖర్చుతో అందిస్తున్న మద్దతు ధర, 90శాతం సబ్సీడీతో యూరియా, ఉపాధి హామీ పథకం వంటి వాటితో ఏడాదికి ఒక్కోరైతు కుటుంబానికి 60నుంచి 70వేల కోట్లు కేంద్రం అందిస్తుందన్నారు. వాస్తవానికి దేశంలో, రాష్ట్రంలో వరి సాగు అవసరాని మించి జరుగుతోందన్నారు. అయినప్పటికి రైతులు ఇబ్బందులు పడవద్దని కేంద్రం మద్ధతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఇందులో రాష్ట్రం చేసేదేమి లేదన్నారు. రుణమాఫీ ఏడాది నుంచి అమలు కాలేదన్నారు. మున్సిపాల్టీలు, స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులమే లేవన్నారు.

Advertisement

Next Story

Most Viewed