రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు.. బీఆర్ఎస్‌కు ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశం!

by Ramesh N |   ( Updated:2024-02-15 10:04:59.0  )
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు.. బీఆర్ఎస్‌కు ఒక రాజ్యసభ సీటు దక్కే అవకాశం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత దీపాదాస్ మున్షీ సమక్షంలో వారు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. వారు మూడు సెట్లుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

బీఆర్ఎస్‌కు ఒక్క రాజ్యసభ సీటు దక్కే అవకాశం!

మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవి చంద్ర రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగిసింది. రేపు నామినేషన్లు పరిశీలన ఉంటుంది. 20వ తేదీన ఉపసంహరణ, 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క రాజ్యసభ సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed