BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు

by Gantepaka Srikanth |
BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)పై కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆర్డీవో మహేశ్వర్(RDO Maheshwar) ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తన తీరుపై కంప్లైంట్ చేశారు. అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చి, మిస్ బిహేవ్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్‌(Karimnagar Collectorate)లో ఆదివారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. చివరకు ఇది ఘర్షణకు దారి తీసింది.

Next Story