- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాహుల్ గాంధీ ఆదేశాలే పాటించా.. కులగణనపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదేశాలనే తాను పాటించానని, రాజకీయ శక్తులే దీనిని వ్యతిరేకిస్తున్నాయని కులగణన (Caste census)ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ సంఘాల నాయకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud), ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (MP Anil Kumar Yadav) సహా బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి దృష్యాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న సీఎం.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన.. బీసీ కుల గణన ఒక సాహసోపేత నిర్ణయమని, త్రికరణ శుద్ధిగా లెక్కతేల్చామని, వందేళ్లలో జరగనిది మేం 100 శాతం సరైన లెక్కలు తేల్చామని తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ ఆదేశాలే తాను పాటించానని, తప్పుడు లెక్క అనేవారిది తప్పుడు మాట అని చెప్పారు. అంతేగాక బీసీల లెక్క తేలితే నష్టపోయే రాజకీయ శక్తులే దీనిని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. తప్పుడు లెక్కలు అని ముద్రవేసి బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుల గణన బీసీలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అని, ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదేనని స్పష్టం చేశారు.
ఇక రాజకీయ ప్రేరేపితానికి లోనైతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని, బీసీలు ఓన్ చేసుకోకపోతే ఈ లెక్కలు పట్టాలెక్కవని, కుట్రలను ఛేదించకపోతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని తెలిపారు. మంచి చేసిన నన్నే రాళ్లతో కొడదామనుకుంటే నష్టపోయేది బీసీలేనని అన్నారు. కుల గణన వ్యతిరేకిస్తున్న వాడిని వదిలేసి.. బీసీ లెక్కలు తేల్చిన మాపై ఆరోపణలు చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనని హితవు పలికారు. ఈ లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక బీసీ మిత్రులకు నా విజ్ఞప్తి అంటూ.. మీ కోసం నేను నా శక్తి మేరకు సాహసం చేశానని, దీనిని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మీదేనని రేవంత్ రెడ్డి అన్నారు.
Read More : ఇంత కష్టపడ్డా నన్ను విలన్‌ను చేస్తున్నారు.. కాంగ్రెస్ నేతలపై సీఎం ఫైర్