- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth: నేడు కంట్రోల్ కమాండ్ సెంటర్‌కు సీఎం.. ఆ శాఖ అధికారులతో కీలక భేటీ

దిశ, వెబ్‌డెస్క్: పాలనాపరమైన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఉదయం 10.30కి బంజారా హిల్స్ (Banjara Hills)లోని కంట్రోల్ కమాండ్ సెంటర్ (Control Command Center)లో విద్యా శాఖ అధికారులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాబోయే 10వ తరగతి (SSC), ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల నిర్వహణపై చర్చించనున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా విలువైన సూచనలు, సలహాలను సంబంధిత శాఖ అధికారుల నుంచి స్వీకరించి వాటిపై లోతుగా చర్చించనున్నారు. పేపర్ లీకేజీ (Paper Leakage)లు గతంలో తలెత్తిన ఇతర సమస్యలు పునరావృతం కాకుండా సీఎం, అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు తీసుకోవాల్సి ముందు జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), విద్యా శాఖ అధికారులతో భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమీక్ష అనంతరం అక్కడే 11.30కి టూరిజం శాఖ (Tourism Department) అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.30కి గాంధీ భవన్‌లో టీపీసీసీ (TPCC) సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 5 గంటలకు జలవిహార్ (Jala Vihaar)లో ‘విజయ తెలంగాణ’ (Vijaya Telangana) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.