- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth: గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలి.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహాలపై ఇవాళ గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (AICC Incharge Meenakshi Natarajan), మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంచార్జీలు, యూత్ కాంగ్రెస్, NSUI సేవాదళ్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. పకడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జీని నియమించాలని తెలిపారు.
అదేవిధంగా యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు గ్రామ స్థాయి నుంచి వ్యూహాలు రచించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉన్న వాళ్లను కూడా ఓట్లు వేయించేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు పూర్తి స్థాయిలో ఎన్నికల వ్యూహంతో పని చేయాలని అన్నారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా ప్రాధాన్యత తీసుకోవాలని అన్నారు. ఎలిమినెట్ సిస్టమ్ (Eliminate System)లో ఓట్ల లెక్కింపు ఉన్నందున ప్రతి ఓటు కీలకం అని తెలిపారు. ఓటర్ మ్యాపింగ్ (Voter Mapping), ఓటర్లను ప్రత్యేకంగా కలవడం, వాళ్లను గ్రామ స్థాయి నుంచి బూత్‌కు తీసుకళ్లడం లాంటి అంశాలు చాలా కీలకమని పేర్కొన్నారు. ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండకూదని గాంధీ భవన్ (Gandhi Bhavan) నుంచి కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.
ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.. ఏఐసీసీ ఇంచార్జ్
ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాలా కీలకమైదని, ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి (AICC Incharge Meenakshi Natarajan) నటరాజన్ అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్సీ స్థానాలను నిలబెట్టుకోవాల్సి అవసరం ఉందన్నారు. పార్టీని యువతోకి తీసుకెళ్లి విజయం సాధించేలా కష్టపడాలని నాయకులు, కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.