- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పని చేయకపోతే మోడీని కూడా ఉతికి ఆరేస్తా.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అభివృద్ధి కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరులో నిర్వహించిన ‘ప్రజా దీవెన’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై సభా ముఖంగా ప్రధాని నరేంద్ర మోడీని నిలదీశాను అని చెప్పారు. ప్రధానికి ఎందుకు వినతిపత్రాలు ఇచ్చారని కొందరు మాట్లాడుతున్నారు.. అతిథి ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని తాను నమ్ముతానని బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అంటే.. బిల్లా రంగా సమితి అని ఎద్దేవా చేశారు. మన మంచితనం చేతకానితనం కాదని.. మనం అడిగిన పనులు చేయకపోతే మోడీని కడా ఉతికి ఆరేస్తానని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించకపోతే అన్ని రాష్ట్రాలు తిరిగి మరీ కేంద్రంపై పోరాటం చేస్తా అని చెప్పారు. కేసీఆర్ లాగా రాష్ట్రాన్ని మోడీ మోకాళ్ల దగ్గర పెట్టబోను అని హామీ ఇచ్చారు. కేసీఆర్ వేసిన చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతూ నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నామని అన్నారు. మూడు నెలలుగా విశ్రాంతి లేకుండా సచివాలయానికి వెళ్తూ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ఈ ప్రభుత్వాన్ని మాత్రం రెండు నెలలకే పడగొడుతామని అంటున్నారని సీరియస్ అయ్యారు. పేదల ప్రభుత్వాన్ని పడగొడుతామన్న వారికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.