లండన్‌లో రెచ్చిపోయిన CM రేవంత్.. కేసీఆర్‌ను చెట్టుకు వేలాడదీస్తానని షాకింగ్ కామెంట్స్

by GSrikanth |   ( Updated:2024-01-20 07:59:52.0  )
లండన్‌లో రెచ్చిపోయిన CM రేవంత్.. కేసీఆర్‌ను చెట్టుకు వేలాడదీస్తానని షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం పలు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం లండన్‌లోని తెలంగాణకు చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను పాతాలంలో 100 మీటర్ల లోతులో పాతిపెడతా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో చూద్దామన్నా బీఆర్ఎస్ కనిపించదని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ కారు గుర్తే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. పలుమార్లు కేసీఆర్‌ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మరోసారి లండన్ వేదికగా స్పందించారు. పులి బయటకు వస్తే.. బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామని వార్నింగ్ చేశారు. ఒక్క ఎన్నికకే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని.. తగ్గించే బాధ్యత నాదే అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Read More: కేసీఆర్‌ను బోనులో వేసి బంధిస్తానన్న రేవంత్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!

Advertisement

Next Story