- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy: మా నీటి లెక్కలు తేల్చాల్సిందే.. ఏపీ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: కృష్ణా జలాల్లో (Krishna Water) తెలంగాణ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నదో అలాంటి సమస్య గోదావరి ప్రాజెక్టులపై (Godavari Projects) ఎదురుకోవడానికి తెలంగాణ సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) తో కలిసి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR.Patil) తో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం మీడియా మాట్లాడిన సీఎం.. సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, నీటి వినియోగంపై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల అనుమతులు, నీటి కేటాయింపుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మంత్రితో చర్చించామన్నారు. గోదావరి జలాలను మూసీకి అనుసంధానించాలని ఇటీవలే ప్రధాని మోడీని కోరామని, తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం కావాలన్నారు. మా ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీటి కేటాయింపులు జరిగిన తర్వాతనే వరద జలాల మిగులు లెక్క తేలుతుందన్నారు. అది జరగకుండా శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం పెడుతున్న అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలన్నారు. మా నికర జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్క-సారక్క, సీతరామ, ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపే ఇప్పటి వరకు జరగలేదు. అలాంటప్పుడు సముద్రంలో కలుస్తున్న నీళ్లను మేము వాడుకుంటే అభ్యంతరం ఏంటని ఆంధ్రప్రదేశ్ వాదించడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులపై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు. తెలంగాణకు నీటి కేటాయింపులు జరిగాక అప్పుడు ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇస్తే దానిపై జీఆర్ఎంబీలో చర్చ చేద్దామన్నారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.
మా లెక్క తేలీతేనే మీ లెక్క తేలేది:
ఏపీలో (AP) అధికార పక్షం కేంద్రంలోని ఎన్డీయేలో (NDA) మిత్రపక్షంగా ఉందని తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇప్పిచేలా చూడాలన్నారు. మా అనుమతులు క్లియర్ అయితే ఏపీ అనుమతులు కూడా క్లియర్ అవుతాయన్నారు. మా ప్రాజెక్టుల విషయం గందరగోళంలో ఉండగా వరద జలాలపై ఏపీలో ప్రాజెక్టులు నిర్మిస్తామంటే కచ్చితంగా తెలంగాణకు (Telangana) అభ్యంతరం ఉంటుందన్నారు. ఈ విషయంలో శషబిషలకు తావులేదని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నదన్నారు. గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నింటికి అనుమతులు, నీటి కేటాయింపులు వచ్చాక మిగతా వాటిమీద చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఎస్ఎల్ బీసీ ప్రమాదంపై కేంద్ర మంత్రికి వివరించామన్నారు.