- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 వాయిదా వేయకపోవడానికి రీజన్ అదే.. ఎట్టకేలకు కారణం రివీల్ చేసిన CM రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న గ్రూప్-1, డీఎస్సీ పరీక్షలు వెంట వెంటనే ఉన్నాయని.. రెండు పరీక్షలు ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేకపోకపోవడంతో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనలు చేస్తో్న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయకపోవడానికి గల అసలు కారణం ఏంటో సీఎం రేవంత్ రెడ్డి రివీల్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ లోని జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:50కి బదులుగా 1:100 పర్సంటేజీ ఫార్ములా అనుసరించాలని కొందరు కోరుతున్నారని, అలా చేస్తే కోర్టులు వెంటనే గ్రూప్-1 ప్రక్రియను నిలిపివేస్తాయన్నారు. నోటిషికేషన్‌లో ఇచ్చినట్లుగా 1:50 బదులు 1:100 ఫార్మూలా ఫాలో అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే గ్రూప్-1 పరీక్షలు మళ్లీ పోస్ట్ పోన్ అవ్వడం లేదా రద్దు అవుతాయని సీఎం క్లారిటీ ఇచ్చారు.
ఈ కారణం చేతనే గ్రూప్-1 పరీక్షకు 1:100 పద్దతి ఫాలో కావడం లేదని తెలిపారు. మరికొందరు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని.. ఇందులో ఎక్కువగా కోచింగ్ సెంటర్ నిర్వహకులు, నిరుద్యోగులే ఉన్నారని అన్నారు. పరీక్షల వాయిదా కోసం దీక్ష చేసిన ముగ్గురిలో ఒక్కరూ కూడా పరీక్ష రాయడం లేదని వెల్లడించారు. అభ్యర్థులకు నష్టం జరగకూడదనేదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ నేతల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ సభ్యుల ఎంపిక సరిగ్గా జరగలేదని, అర్హత లేనివారికి బోర్డులో చోటు కల్పించారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్పీని పూర్తిగా ప్రక్షాళన చేసి.. పటిష్టమైన మెకానిజం రూపొందించామని తెలిపారు.