CM Revanth Reddy: ఆయన వల్లే ఎమ్మెల్సీ ఓటమి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
CM Revanth Reddy: ఆయన వల్లే ఎమ్మెల్సీ ఓటమి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానమైన కరీనగర్ గ్రాడ్యుయేట్ (Graduate MLC) సీటును కోల్పోవడంపై సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు బీజేపీకి పూర్తిగా లొంగిపోయాడని సీఎం ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దగ్గర ఉండి బీజేపీకి ఓట్లు వేయించాడు. అందుకే ఒడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లతో సంబంధం వల్లే భట్టి సమావేశానికి బీజేపీ రాలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ కులగణన తో సామాజిక న్యాయం జరిగిందని, మేము చేసిన కుల గణన వల్లే ఇవాళ అన్నీ పార్టీలు బీసీ లకు ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాయన్నారు.

ఆ ముగ్గురు తీన్మార్ డ్యాన్సులు:

రైతులు బాధ పడుతున్నారు అని తెలియగానే కేసీఆర్(KCR), కేటిఆర్, హరీష్ రావులు తీన్మార్ డాన్స్ లు వేసి పైచాచిక ఆనందం పొందుతున్నారని సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలో శవాలు చేస్తే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పడావ్ పెట్టి కాళేశ్వరం కట్టిందని ఆరోపించారు. కరువు అంటున్నారు పండిన పంట నివేదిక చూసి మాట్లాడాలి తప్ప పిచ్చి మాటలు మాట్లాడడం ఎందుకన్నారు. గతంలో రెండో పంట 35లక్షల ఎకరాలు వేశారు. కానీ ఇప్పుడు మొదటి సారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాలలో రైతులు పంటలు వేశారని చెప్పారు.

కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా?

తెలంగాణ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ నిధులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చర్చకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారు. ఆ చర్చకు నేను, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వస్తామని కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుండి ఎన్ని పన్నులు కట్టాం, వాళ్లు ఎన్ని ఇచ్చారో లెక్క తేలుద్దామన్నారు. ఒక వేళ అధిక నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే కిషన్‌రెడ్డికి సన్మాసం చేస్తామన్నారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ చేపట్టవద్దని ఓ వైపు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్షణ్ ఆందోళనలు చేస్తూ అడ్డుపడుతూ మళ్లీ వాళ్లే భూసేకరణ చేయట్లేదని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేననన్నారు. రింగ్ ఉంటేన రింగ్ రొడ్డు అంటారని సగం పూర్తి చేసిన వాటిని రింగ్ రోడ్డు అనరని కిషన్ రెడ్డికి సెటైర్ వేశారు. మోడీ రీజినల్ రింగ్ రోడ్డు ఇస్తున్నాం అన్నారు. మరి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క అఖిలపక్షానికి ఆహ్వానిస్తే బీజేపీ నాయకులు ఎందుకు డుమ్మా కొట్టారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ సమావేశానికి కిషన్ రెడ్డి ఎందుకు రాలేదని నిలదీశారు. మోడీ బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కి ఇచ్చారు మరి తెలంగాణ కు ఎందుకు ఏమీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వచ్చాకే కాజీపేట కొచ్ ఫ్యాక్టరీ వచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు అవసరం అయితే 99 సార్లు ఢిల్లీకి వెళ్తామన్నారు.

కేసీఆర్ కు ఆ స్థాయి లేదు:

కేసీఆర్ చెల్లని రూపాయి అని ఆయన గురించి మాట్లాడటం వృథా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ' కేసీఆర్‌ స్థాయికి కాంగ్రెస్‌లో ఎవరూ సరిపోరని. వాళ్ల పిచ్చి మాటలు, పనికిమాలిన దూషణలు, కారుకూతలు వినడానికి కేసీఆర్‌ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ను బండకేసి కొట్టి ఓడించింది నేను. తండ్రి కొడుకులకు బలుపు తప్ప ఏమీ లేదు. డ్రగ్స్ పార్టీలు దొరకడం కేటీఆర్ స్టెచరా? కేటిఆర్ అన్నట్లు నిజంగానే అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదు అన్నారు. కేటీఆర్ ఓ పిచ్చోడు.. ఏదేదో మాట్లాడతాడు. అతడు క్రిమినల్స్ కేసులకు భయపడరు. భయపడే వ్యక్తే అయితే నేరాలు చేయడని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా డిల్లికి వెళ్తానన్నారు. డీలిమిటేషన్ కోసం భట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ వేసినట్లు చెప్పారు.



Next Story

Most Viewed