గ్రేటర్‌ పరిధిలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం

by Shiva |   ( Updated:2024-12-03 02:08:13.0  )
గ్రేటర్‌ పరిధిలో రూ.4 వేల కోట్ల అభివృద్ధి పనులు.. వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు రూ.4 వేల కోట్ల పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంగళవారం ఐమాక్స్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి వర్చువల్‌గా సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమన్వయం చేస్తున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్‌మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.3,500 కోట్ల ప్రాజెక్టు పనులు, రూ.17 కోట్లతో నిర్మించనున్న 12 రెయిన్ వాటర్ సంపులు, రూ.150 కోట్లతో 283 జంక్షన్ల సుందరీకరణ పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. దీంతో పాటు జలమండలికి సంబంధించిన మీరాలం ట్యాంకు, మియాపూర్-పటాన్‌చెరు, సఫిల్‌గూడ, ఫతేనగర్, నాగోల్, ఖాజాకుంట ప్రాంతాల్లో నిర్మించిన సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీలు), 19 వాటర్ రిజర్వాయర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

హెల్త్ క్యాంపులు..

జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో పారిశుధ్య కార్మికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. అన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేయనున్నారు. వీటితో పాటు కార్మికులకు పీపీఈ కిట్లను అందజేయనున్నారు. 2కే రన్ సైతం నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed