- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy : రేపు ఇందిరమ్మ ఇళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు సర్కార్ భారీ శుభవార్త తెలిపింది. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో కీలకమైనది ఇందిరమ్మ ఇండ్లు(Indiramma Houses). ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సర్కార్ అన్నీ దఫాల వడపోతాల అనంతరం అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీగా ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం సీఎం నారాయణపేట జిల్లా(Narayanapeta District) పర్యటన సందర్భంగా నారాయణపేట మండలంలోని అప్పకపల్లె(Appakapalle)లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి.. రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 72,045 ఇందిరమ్మ ఇండ్లు విడుదల కాగా.. వాటన్నిటికీ రేపు శంకుస్థాపన పనులు మొదలు కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాలందరికీ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వ సంకల్పంలో భాగంగా.. లబ్దిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడితో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్మెంట్ కట్టగానే రూ.1,00,000 లబ్దిదారుని ఖాతాకి నేరుగా విడుదలయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.