CM Revanth Reddy: రేపే రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పాలసీ ప్రకటన

by Prasad Jukanti |
CM Revanth Reddy: రేపే రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పాలసీ ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయబోతున్నది. సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కోసం బుధవారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని విడుదల చేయబోతున్నది. రేపు ఉదయం 11 గంటలకు ఎంఎస్ఎంఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేసేలా పరిశ్రమల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇదివరకే పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికాలో ఉన్న వ్యాపారావకాశాలన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయని చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆరు కొత్త పాలసీలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామికాభివృద్ధికి ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ, రివైజ్డ్‌ ఈవీ పాలసీ, మెడికల్‌ టూరిజం పాలసీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త విధానాలను ఖరారు చేయాలని గతంలో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేపు ఎంఎస్ఎంఈ పాలసీని ప్రభుత్వం ప్రకటించబోతున్నది.

Advertisement

Next Story

Most Viewed