- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
MLA లాస్య నందిత కుటుంబాన్ని ఓదార్చిన CM రేవంత్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు. శుక్రవారం మేడారం పర్యటన ముగించుకొని నేరుగా కంటోన్మెంట్‌కు సీఎం చేరుకున్నారు. మారేడుపల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళ్లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
కాగా, ఇవాళ ఉదయం హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందిత దుర్మరణం చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, సాయన్న మరణంతో ఆయన కుమార్తె లాస్య నందితకు బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన గద్దర్ కుమార్తెపై నందిత తెలుపొందింది.