CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |
CM Revanth Reddy: భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence)దేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ గచ్చిబౌలిలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌ (Microsoft Campus) నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త మైక్రోసాఫ్ట్ క్యాంపస్ (Microsoft Campus) ఏర్పాటు చేయబోతున్నందుకు ఆ కంపెనీ ప్రతినిధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దేని అన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌ (Hyderabad)లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కావడం ఐటీ ఇండస్ట్రీ జర్నీలో ఇదొక అద్భుతమైన మైలురాయి అని కొనియాడారు. హైదరాబాద్ మహా నగరంతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుధీర్ఘ భాగస్వామ్యం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా నగరంలో ఏఐ సెంటర్ (AI Center) ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌తో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఇటీవలే ఆ కంపెనీ భారత్‌ (India)కు వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft), తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) భాగస్వామ్యంతో సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) బేస్డ్ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించారు.

Next Story

Most Viewed