CM Revanth Reddy: దేశ రక్షణలో తెలంగాణదే మెయిన్ రోల్.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-02-28 08:33:08.0  )
CM Revanth Reddy: దేశ రక్షణలో తెలంగాణదే మెయిన్ రోల్.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రక్షణలో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ప్రధాన పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని గచ్చిబౌలి (Gachibowli)లో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ (Defense Exhibition)ను ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Union Defense Minister Rajnath Sing)తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ (Telangana) కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇప్పటికే రక్షణ శాఖకు సంబంధించి విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్‌ (Hyderabad)లో ఉన్నాయని తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ (Science Exhibition)తో నిత్యం లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

సాంప్రదాయ ఇంజనీరింగ్‌కు తోడ్పాటును ఇచ్చేందుకు డిఫెన్స్ ఎగ్జిబిషన్ (Defense Exhibition) ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు. రక్షణ శాఖ దేశాన్ని కాపాడంలో కీలక పాత్ర వహిస్తుందని.. అదేవిధంగా దేశ రక్షణ బాధ్యత యువతపై ఉందని అన్నారు. మిస్సైల్స్ తయారీ చేసే పరిశ్రమలు డీఆర్డీఎల్, బీడీఎల్, డీఆర్డీవో, మిధానీ మన దగ్గర రాష్ట్రంలోనే ఉడటం సంతోషకరమని అన్నారు. బెంగళూరు తరహాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సీఎం కోరారు. కాగా, నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించనున్నారు. త్రివిధ దళాలపై యువతకు అవగాహన కల్పించనున్నారు.

Next Story

Most Viewed