- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు CM రేవంత్ రెడ్డి నివాళి

దిశ, వెబ్‌డెస్క్: ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పుష్పాంజలి ఘటించారు. అనంతరం శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వాకాటి శ్రీహరి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం ఛత్రపతి శివాజీని స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
శివాజీ యొక్క “వీరత్వం మరియు దూరదృష్టి నాయకత్వం దేశ ఐకమత్యానికి పునాది వేసింది” అని ప్రధాని మోడీ చెప్పారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్మరించుకుంటూ “ఛత్రపతి శివాజీ మహారాజ్ తులనాత్మక ధైర్యం, న్యాయం యొక్క వాగ్దానం మరియు ప్రజల సంక్షేమం మనకు స్ఫూర్తినిస్తున్నాయి. శివాజీ మహారాజ్ యొక్క నిస్వార్థ సేవ, సమగ్రత మరియు స్థితిస్థాపకత వారసత్వం రాబోయే తరానికి శ్రేయస్సు మరియు శాంతిని సులభతరం చేస్తాయి’’ అని పేర్కొన్నారు.