- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. మండలిలో CM రేవంత్ ఆసక్తకిర వ్యాఖ్యలు

దిశ, వెబ్డెస్క్: స్టేచర్పై తాను మాట్లాడిన మాటలకు ఇంకా కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. శనివారం ఆయన మండలిలో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా కేసీఆర్(KCR) రూ.57 లక్షల జీతం తీసుకుంటున్నారు.. అసెంబ్లీ(Telangana Assembly)కి రావట్లేదు.. ప్రభుత్వానికి సూచనలు చేయట్లేదు.. ప్రజల్లో ఉండట్లేదు.. క్షేత్రస్థాయిలో పర్యటించట్లేదు అని అన్నారు. అలాంటప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు? అని ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్(BRS) నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలకు కారణం వారి అప్పులే అని అన్నారు. ఎన్నికల వేళ రైతులకు తామిచ్చిన హామీలన్నీ అమలు చేశాం.. రుణమాఫీ(Runa Mafi) చేశాం, రైతు భరోసా(Rythu Bharosa) ఇస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్(Congress Govt) విధానాలే గవర్నర్ ప్రసంగం(Governor's Speech)లో ఉంటాయని అన్నారు. గతంలో రైతులకు రుణమాఫీ చేయాలంటే.. ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఎగ్గొట్టాడని గుర్తుచేశారు. కేసీఆర్ మోసం చేశాడు కాబట్టే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల పైచిలుకు రుణమాఫీ చేశామని అన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. వారికి ఏడాదికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లే అని గతంలో కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు.
READ MORE ...