- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్‌కు ఆ పురస్కారం ఇవ్వాలి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రతిపాదన

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు భారతరత్న (Bharat Ratna) పురస్కారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని పెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఉపాధి హామీ, ఆర్టీఐ (RTI) లాంటి చట్టాలు చేసిన ఘటన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కే దక్కిందన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్‌ది కీలక పాత్ర అని అన్నారు. సరళీకృత విధానాలతో ప్రపంచలో భారత్ (India) పోటీ పడేలా చేశారని గుర్తు చేశారు. దేశానికి శక్తి వంచన లేకుండా విశిష్ట సేవలు అందజేశారని కొనియాడారు. నీతి, నిజాయితీతో మన్మోహన్ సింగ్ పోటీ పడేవారని అన్నారు. దేశం ఓ గొప్ప తత్వవేత్తను కోల్పోయిందని ఎమోషనల్ అయ్యారు. ప్రపంచమే గర్వించదగిన ఆర్థకవేత్తను కోల్పోవడం నిజంగా తీరని లోటని పేర్కొన్నారు.