CM Revanth Reddy: తెలంగాణకు ఆత్మ బంధువు మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |
CM Revanth Reddy: తెలంగాణకు ఆత్మ బంధువు మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)కు ఆత్మ బంధువు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ సంతాప తీర్మానాన్ని పెట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అద్భతమైన పరిపాలన అందించారని, ఎవరు ఎన్ని విమర్వలు చేసినా ఆయన పని మీదే ధ్యాస పెట్టారని గర్తు చేశారు. 2013లో భూ సేకరణ చట్టం (Land Acquisition Act)తో గ్రామాల్లో నిరుపేతలకు కూడా సాయం అందిందని అన్నారు. గ్రామాల్లో భూమి లేని వారికి కూడా నష్ట పరిహారం అందించేలా చట్టం చేశారని పేర్కొన్నారు. నేడు ఐటీ (IT)లో ప్రపంచాన్ని భారత్ శాసిస్తోందంటే మన్మోహన్ సరళీకృత విధానమేనని కారణమని అన్నారు. తెలంగాణ (Telangana)కు మన్మోహన్ సింగ్ ఆత్మ బంధువుని కొనియాడారు. రాష్ట్రంతో ఆయనకు విడదేయలేని బంధం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ శాశ్వతమేనని అన్నారు. గొప్ప తత్వవేత్త, మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.



Next Story