- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ration Cards: రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వెంటనే ఆ జిల్లాల్లో కొత్త కార్డులు ఇవ్వాలని ఆదేశం

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డు జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ (Command Control Centre) లో పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమీక్షలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాక్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు.
తొలుత ఈ జిల్లాల వారికే:
ప్రస్తుతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతున్నది. ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఇవి మినహాయిస్తే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సీఎం ఆదేశాలతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు కానుంది.