BRS ఎమ్మెల్యేల చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-14 10:49:57.0  )
BRS ఎమ్మెల్యేల చేరికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ ప్రణాళికలు చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా ముందుకు వస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో భాగస్వామ్యులం కావాలని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కలుస్తున్నారన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి అండగా నిలబడాలని వస్తున్నారన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నాన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారికి తగిన బుద్ధి చెబుతున్నారు అని తెలిపారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిందని.. కేసీఆర్ చేసిన అప్పులకే ఏడాదికి రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని గుర్తు చేశారు. ఎవరి సమస్య అయినా వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. నిరుద్యోగులు ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావాలని కోరారు.

Advertisement

Next Story