Jana Reddy: జానారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి?

by Prasad Jukanti |
Jana Reddy: జానారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కీలక పదవి?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియత్ నేత జానారెడ్డికి(Jana Reddy)రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన్ను ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు ఈ మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసరంగా మాజీ మంత్రి నివాసానికి వెళ్లడంతో ఈ వార్తలు గుప్పుమంటున్నాయి. కేబినెట్ భేటీకి ముందు సీఎం రేవంత్‌రెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువా, ఫ్లవర్ బొకే‌తో మాజీ మంత్రి సత్కరించారు. అయితే, ప్రభుత్వం అడిగితే సలహాలు ఇస్తానని నిన్న జానారెడ్డి అన్నారు. దీంతో జానారెడ్డికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు పోస్టు ముఖ్యమంత్రి ఆఫర్ చేసినట్లు సమాచారం. గతంలో అనేక శాఖలకు మంత్రిగా పని చేసిన అనుభవం, పట్టుఉన్న జానారెడ్డితో సీఎం ఏం చర్చించారనేది ఆసక్తిగా మారింది. కాగా, జానారెడ్డి కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ఇద్దరు కుమారులు చట్టసభలకు ఎన్నికయ్యారు. రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా, జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ!

త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీపై (MLC) కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత పేరు ఎమ్మెల్సీ పదవికి జానారెడ్డి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జానారెడ్డి‌పై ఎమ్మెల్సీ తీన్మార్ (Teenmar Mallanna) మల్లన్న ఆరోపణలు చేస్తున్న క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసరంగా ఆయన నివాసానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.



Next Story

Most Viewed