- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth Reddy: మహా కుంభాభిషేక సంప్రోక్షణకు రండి.. సీఎంకు ఆహ్వాన పత్రిక అందజేత

దిశ, డైనమిక్ బ్యూరో: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం (Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple) బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఆహ్వానించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ లతో పాటు ఆలయ ఈవో, అర్చకులు, జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
కాగా, ఈ నెల 23న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానంలో బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేక ప్రతిష్ఠమహోత్సవం (Maha Kumbha Abhishekam) నిర్వహించనున్నారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇప్పటికే గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులు ఇటీవలే పూర్తి అయ్యాయి. ఇక దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డుకెక్కింది. ఈ గోపురం 55 అడుగులతో, 68 కిలోల బంగారం గోపురానికి తాపడం కోసం వినియోగించారు. సుమారు రూ.70 కోట్ల వ్యయంతో స్వర్ణ తాపడం పనులు చేపట్టారు.