CM Revanth Reddy: యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది రాజీవ్ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారుల ఉత్తీర్ణత

by Prasad Jukanti |   ( Updated:2024-12-11 12:33:10.0  )
CM Revanth Reddy: యూపీఎస్సీ మెయిన్స్ లో 20 మంది రాజీవ్ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారుల ఉత్తీర్ణత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నుంచి యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ ఫలితాలు (UPSC Mains) విడుదల కాగా అందులో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద ఆర్థిక సహాయం పొందిన 20 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. వీరి ఎంపిక పట్ల సీఎం అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థ సహకారంతో ప్రభుత్వం తెలంగాణ నుంచి ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులై మెయిన్స్ కు అర్త సాధించిన వారిలో అర్హులైన 135 మందికి గత ఆగస్టులో రాజీవ్ సివిల్స్ అభయ హస్తం (Rajiv Gandhi Civils Abhaya Hastam) కింద ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అంధించింది. వారిలో 20 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం పట్ల సీఎం అభినందనలు తెలిపారు. ఈ మేరకు బుధవారం సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగా నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్స్ సాధించేలా తదుపరి దశల్లోనూ అభ్యర్థులు రాణించాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.

Advertisement

Next Story