CM Revanth Reddy : టీంఇండియా మహిళల జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

by M.Rajitha |
CM Revanth Reddy : టీంఇండియా మహిళల జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : వరుసగా రెండోసారి అండర్‌-19 మహిళల ప్రపంచ కప్‌(U19 Women World Cup)ను గెలుచుకున్న టీమిండియా(Team India) జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష(Gongadi Trisha)ని ప్రత్యేకంగా ప్రశంసించారు. మలేషియా వేదికగా జరిగిన U19WorldCup ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా(South Africa)పై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. టోర్నీలో అత్యధిక పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'(Player Of The Tourny)గా నిలిచారు.గొంగడి త్రిష లాంటి క్రీడాకారులు Telangana రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న యువతీ యువకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.

అయితే మహిళల అండ‌ర్-19 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆదివారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఫైనల్​లో భారత్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి విశ్వవిజేత‌గా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్​ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 ప‌రుగులు (8×4) చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్​. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భార‌త జ‌ట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు.

Next Story

Most Viewed