CM Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ!

by Shiva |
CM Revanth Reddy: కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) నుంచి ఢిల్లీ (Delhi)కి బయలుదేరనున్నారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీ (Delhi)కి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎంతో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) హస్తినకు వెళ్లనున్నారు. అయితే, పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఎవరికి ఏ పదవులు కావాలో వారినే డైరెక్ట్‌గా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే ఆశావహులు లాబీయింగ్ కోసం ఢిల్లీ (Delhi)కి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ టూర్ (Delhi Tour) పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలవనున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ఏఐసీసీ పెద్దలను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, తుది జాబితాపై కసరత్తు చేయనున్నారు. అదేవిధంగా కేబినెట్ విస్తరణతో పాటు పార్టీలో కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, శనివారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ ఆయన హస్తినకు వెళ్తున్నారు.



Next Story

Most Viewed