- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth Reddy: ఏడాది పాలనపై సీఎం రేవంత్ మార్క్.. పొలిటికల్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్
దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొత్తలో ఆయనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు అసలైన పార్టీ కల్చర్ రుచి చూపిస్తారనే ప్రచారం జరిగింది. ఓ వైపు సహాయ నిరాకరణ, మరోవైపు అసమ్మతి సెగలతో ఆయన్ను గుక్కతిప్పుకోకుండా చేస్తారనే డిస్కషన్ స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా సాగింది. ప్రభుత్వ పదవులు ఇవ్వలేదని కొందరు, పనులు చేయలేదని మరికొందరు లీడర్ల నుంచి వచ్చే అసంతృప్తి జ్వాలలు చల్లార్చడం ఆయన తరం కాదని ఓపెన్‌గానే మాట్లాడుకున్నారు. కానీ ఏడాదిలో అందరి అంచనాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్‌లో అప్పర్ హ్యాండ్ సాధించారు. పవర్‌లోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారు. ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో పార్టీ, ప్రభుత్వంలో అసమ్మతి తలెత్తకుండా సక్సెస్ అయ్యారు.
కాంగ్రెస్ కల్చర్‌కు భిన్నంగా
కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగదాలకు కేరాఫ్ అడ్రస్ అనే ప్రచారం ఏండ్ల నుంచి ఉన్నది. కొందరు ఓపెన్‌గా ప్రత్యర్థి లీడర్‌కు వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఇంకొందరు మాత్రం తమ వ్యూహాలతో పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ ఉద్దండులుగా ముద్రపడ్డ కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు సొంత పార్టీలోనే అసమ్మతి తలెత్తి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. వారికి వ్యతిరేకంగా గళం వినిపించిన ఇన్సిడెంట్లూ ఉన్నాయి.
ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో సీఎం పదవిపై తీవ్ర పోటీ ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉండి పని చేసిన తమకే ముఖ్యమంత్రి పోస్టు ఇవ్వాలని సీనియర్ లీడర్లు పట్టుబట్టారు. కానీ అప్పటికే పీసీసీ అధ్యక్షుడిగా పని చేస్తున్న రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించేందుకు రాహుల్‌గాంధీ డెసిషన్ తీసుకున్నారు. ఆ సందర్భంలోనే పార్టీలో అసమ్మతి పెరుగుతుందనే ప్రచారం మొదలైంది. సీఎం పదవి దక్కలేదని అక్కసుతో సీనియర్లు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతారనే డిస్కషన్ సాగింది. కానీ రేవంత్‌రెడ్డి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్లడంతో ఏడాదిగా ఇప్పటి వరకూ పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు కనిపించలేదు.
మంత్రులకు పూర్తి స్వచ్ఛ
సీఎంగా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన నుంచి ఇప్పటి వరకు ఆయన తనకంటూ ఓ లక్ష్మణ రేఖ గీసుకున్నారని, దాన్ని దాటక పోవడంవల్లే ఎక్కడా అసమ్మతి, అసంతృప్తి తలెత్తలేదనే ప్రచారం ఉన్నది. దీనికి తోడు మంత్రులకు పూర్తి స్వే్చ్ఛ ఇచ్చారు. ఏ శాఖలోనూ రేవంత్ ఇప్పటి వరకూ జోక్యం చేసుకోలేదు. బిజినెస్ రూల్స్ ప్రకారం వివిధ శాఖలకు చెందిన ఫైల్స్ తన వద్దకు వస్తే దాని గురించి తెలుసుకుంటున్నారే తప్పా, ఆ శాఖలోని మిగతా పనుల గురించి అస్సలు పట్టించుకోవడం లేదనే టాక్ ఉన్నది. ఎవరైన లీడర్లు ‘ఫలాన శాఖలో పని ఉంది చేసి పెట్టండి’ అని అడిగితే ‘ఆ శాఖ తన పరిధిలో లేదు. సంబంధిత మంత్రి వద్దకు వెళ్లి అడగండి’ అంటూ ముక్కుసూటిగా చెబుతున్నట్టు తెలుస్తున్నది. కొందరు సీనియర్ మంత్రులు తమకు తెలియకుండా తమ శాఖలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వొద్దని చెప్పడంతో ఆ శాఖకు చెందిన పోస్టులను సీఎం ఇప్పటి వరకు భర్తీ చేయలేదని తెలుస్తున్నది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ప్రస్తుతం అందరూ సంతోషంగా ఉన్నారనే డిస్కషన్ సాగుతున్నది.
సన్నిహితంగా మారిన మంత్రులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎంకు వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు చేసే విమర్శలను ఖండించేందుకు మిగతా మంత్రులెవ్వరూ ముందుకు రాలేదు. తమను విమర్శించలేదు కదా? అనేలా ఉండేవారనే ప్రచారం ఉంది. కానీ రేవంత్ తమ శాఖలో జోక్యం చేసుకోకపోవడం, తమ సూచనలు పాటించడం, తమ అవసరాలు గుర్తించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటుండటంతో మంత్రుల తీరులో మెల్లమెల్లగా మార్పు వచ్చిందనే టాక్ ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్‌పై ఏ పార్టీ లీడరైన విమర్శలు చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. గతంలో ఆయన పేరు ఎత్తితే విరుచుకుపడిన లీడర్లు ఇప్పుడు ఆయన్ను ప్రశంసలతో ముంచ్చెత్తుతున్నారు.
పార్టీలోనూ అప్పర్ హ్యాండ్
గతంలో సీఎంకు వ్యతిరేకంగా ఉన్న లీడర్లకు అధిష్టానం పీసీసీ పగ్గాలు ఇచ్చేది. దీంతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులు పని చేస్తూ నిత్యం చికాకులు సృష్టించే వారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన తర్వాత పీసీసీ పోస్టును తనకు సన్నిహితుడైన మహేశ్ కుమార్ గౌడ్‌కు ఇవ్వాలని పట్టుపట్టి మరీ ఇప్పించుకున్నట్లు టాక్. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర లీడర్లకు ఆ పదవి ఇస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, జరిగే పరిణామాలను ఢిల్లీ పెద్దలకు వివరించి వారిని ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. హైకమాండ్ సైతం ఇతర ప్రపోజల్స్‌ను పక్కన పెట్టి మహేశ్ కుమార్‌ను పీసీసీ చీఫ్‌గా ప్రకటించింది. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మహేశ్ కుమార్ సైతం రేవంత్‌కు తెలీకుండా ఏ డెసిషన్ తీసుకోలేదు.