CM Revanth Reddy : రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

by Shiva |
CM Revanth Reddy : రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​‌రెడ్డి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ప్రత్రికా ప్రకటనను విడుదన చేశారు. ప్రతి ఇంట్లో పండుగ వాతావరణంతో కలకలలాడాలని ఆకాంక్షించారు. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని వేడుకున్నారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబురాలు జరుపుకోవాలని పేర్కొన్నారు. సకలజన హితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్‌‌రెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story