TG News: వెనక్కి తగ్గం.. కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:17 Sept 2024 9:17 AM  )
TG News: వెనక్కి తగ్గం.. కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: హైడ్రా (HYDRA)పై వెనక్కి తగ్గేదిలేదని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం (Telangana Public Governance Day) వేడుకల్లో పాల్గొన్న ఆయన.. హైడ్రాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కచ్చితంగా కూల్చివేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రాను కంటిన్యూ చేస్తామన్నారు. కూల్చివేతల వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువులు, కుంటలు, నాలాల్లో అక్రమంగా భవనాలు, ఇళ్లను కూల్చివేసింది. పెద్ద పెద్ద భవనాలు, భారీ కట్టడాలకు నోటీసులు జారీ చేసింది. యజమానులు కూల్చకపోతే తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ హైడ్రా చర్యలపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు, కొంతమంది ప్రజలనుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. ఇక రాజకీయ నాయకులైతే హైడ్రా అధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed