SHIELD-2025: రోబోతో సీఎం రేవంత్ ముచ్చట్లు.. ‘షీల్డ్‌-2025’ సదస్సులో ఆసక్తికర సన్నివేశం

by Ramesh N |
SHIELD-2025: రోబోతో సీఎం రేవంత్ ముచ్చట్లు.. ‘షీల్డ్‌-2025’ సదస్సులో ఆసక్తికర సన్నివేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నేటి నుంచి రెండు రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Cyber ​​Security) ఆధ్వర్యంలో ‘షీల్డ్‌ కాంక్లేవ్-2025’ (‘SHIELD 2025’) సదస్సు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను రక్షించే ఆవిష్కరణలపై కాంక్లేవ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్, సైబర్ ఫ్యూజన్ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కాంక్లేవ్‌లో ఏర్పాటు చేసిన రోబోతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా రోబోకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఇక, అధికారులతో రోబో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే సైబర్ సేఫ్టీలో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలపడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.. అని తెలిపారు. డిజిటల్ సేఫ్టీ, ఫ్యూచర్ గురించి చర్చించేందుకు షీల్డ్ 2025ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. మొదటిసారి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణను నంబర్ వన్ సైబర్-సేఫ్ స్టేట్‌గా మార్చడానికి కలిసి పనిచేస్తున్న మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉంది.. అని వివరించారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్‌గా మార్చాలి.. తెలంగాణను సైబర్ సేఫ్ స్టేట్‌గా మార్చేందుకు మనమంతా కలిసి పని చేద్దాం.. అని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed