- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
CM Revanth Reddy: ఆశావహులకు బిగ్ అలర్ట్.. సర్పంచ్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష
![CM Revanth Reddy: ఆశావహులకు బిగ్ అలర్ట్.. సర్పంచ్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష CM Revanth Reddy: ఆశావహులకు బిగ్ అలర్ట్.. సర్పంచ్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష](https://www.dishadaily.com/h-upload/2025/01/29/415965-9.webp)
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సర్పంచ్ పదవికి పోటీ పడుతోన్న ఆశావహులు ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికల ప్రకటన చేస్తుందా అని కల్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఏడాది కాలంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతోంది. అదేవిధంగా 7 నెలల క్రితమే ఎంపీపీ (MPP), జెడ్పీ చైర్మన్ల ZP Chairman) పదవీ కాలం పూర్తి కావడంతో అభివృద్ధి పనుల నిర్వహణ కూడా స్పెషల్ ఆఫీసర్ల (Special Officers) పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో బంజారా హిల్స్ (Banjara Hills)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (Control Command Center)లో పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department)పై ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క (Minister Seethakka)తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ (BC Dedication Commission) చైర్మన్, తదితరులు పాల్గొనబోతున్నారు.
ఇక, బీసీ డెడికేషన్ కమిషన్ (BC Dedication Commission) నివేదిక కోసం కాంగ్రెస్ సర్కార్ (Congress Government) వేచి చూస్తుంది. ఇప్పటికే కమిషన్ రిపోర్టును కూడా రెడీ చేసింది. ఇవాళ్టి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి తుది నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆ తరువాతే రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు జరిగే భేటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
కొత్త పథకాలు గట్టెక్కిస్తాయనే నమ్మకం..
ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. రైతు భరోసా (Raithu Bhaorsa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Idiramma Aathmiya Bharosa), ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses), కొత్త రేషన్ కార్డుల (New Ration Cards)ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ప్రజా ప్రభుత్వంపై జనాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి లాభం చేకూరుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.