CM Revanth: రేపటి నుంచి నాలుగు కొత్త పథకాల అమలు.. అధికారులకు సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు

by Shiva |
CM Revanth: రేపటి నుంచి నాలుగు కొత్త పథకాల అమలు.. అధికారులకు సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపటి నుంచి నాలుగు కొత్త పథకాలు అమల్లోకి వస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ ఆయన బంజారా హిల్స్‌ (Banjara Hills)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (Command Control Center)లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీ, రైతు భరోసా (Raithu Bharosa), ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (Indiramma Aathmiya Bharosa) పథకాలను రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఒక్క హైదరాబాద్ (Hyderabad) మినహా అన్ని జిల్లాల్లోని మండలాల పరిధిలో ఒక్కో గ్రామాన్ని నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు సమర్ధవంతంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఏమాత్రం అన్యాయం జరగొద్దని, అనర్హులైన వారికి లబ్ధి చేకూర్చితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


Advertisement
Next Story

Most Viewed