CM Revanth: ఉచితాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి రావొద్దు: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
CM Revanth: ఉచితాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి రావొద్దు: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రం ఆర్థికంగా, ధృడంగా ఎదగాలంటే ఉచితాలు మంచివి కావని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ (యూఎస్‌ఏ) సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. మాతృదేశంలో, జన్మభూమిలో పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందని భరోసానిచ్చారు. సొంత రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించి సంతృప్తి బోనస్‌గా లభిస్తుందని అన్నారు. రాష్ట్ర విభజన సమమంలో మిగులు బడ్జెట్‌‌తో ఉన్న రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు. పదేళ్ల విధ్వంసాన్ని సరిచేయాలంటూ తమకు ఎన్‌ఆర్‌ఐల సహకారం అవసరమని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే ఉచితాలు మంచివి కావని.. నిజమైన పేదలకు సాయం అందానేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి రాకూడదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story