- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొత్త ప్రభాకర్ రెడ్డిని పరామర్శించిన CM KCR.. హెల్త్ అప్‌డేట్ ఇదే..!

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై సోమవారం హత్యాయత్నం జరగగా కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ ఎంపీని పరామర్శించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక, కొత్త ప్రభాకర్ రెడ్డికి వైద్యులు సర్జరీ చేశారు. చిన్న పేగుకు నాలుగు చోట్ల గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. 15 సెంటి మీటర్లపై కడుపును కట్ చేసి 10 సెంటి మీటర్లు చిన్న పేగును వైద్యులు తొలగించారు. గ్రీన్ ఛానెల్ తో హైదరాబాద్ కు తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. రక్తం కడుపులో పేరుకుపోయిందని.. అందుకే 15 సెంటిమీటర్లు కట్ చేసి పేరుకుపోయిన రక్తాన్ని క్లీన్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు.
Next Story