నేను బతికున్నంత వరకు ఆ రెండు పథకాలు ఆగవు: KCR సంచలన ప్రకటన

by Mahesh |   ( Updated:2022-12-07 11:11:00.0  )
నేను బతికున్నంత వరకు ఆ రెండు పథకాలు ఆగవు: KCR సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది కాబట్టే.. జగిత్యాల జిల్లాగా ఏర్పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలో నిర్వహించిన భారీ బహిరంగా సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. దేశంలో రైతు బంధు, రైతు బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణే అని చెప్పారు. తాను బతికున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా పథకాలు ఆగవని కేసీఆర్ స్పష్టం చేశారు. బావుల దగ్గర మీటర్లకు పెట్టాలట.. పెడదామా..? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ధాన్యం కొనదని.. కానీ దేశంలో ధాన్యం కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణే అని కీలక వ్యాఖ్యలు చేశారు.

మనం ఇంకా చాలా పనులు పూర్తి చేసుకోవాల్సిన అసవరం ఉందని.. కానీ ఇంతలోనే మన మధ్యలో గోల్ మాల్ గోవిందం గాళ్లు, కారుకూతలు కూసేవాళ్లు తిరుగుతున్నారని.. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బండిలింగాపూర్‌ను మండల కేంద్రం చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణలో అద్భుత పుణ్య క్షేత్రాలు ఉన్నాయని.. ప్రసిద్ధి గాంచిన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తన్నట్లు ప్రకటించారు.

Read more:

జగిత్యాల టీఆర్ఎస్ నాయకుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ... కేసీఆర్ ఆగ్రహం?

Advertisement

Next Story

Most Viewed