- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వ్యాప్త పాదయాత్రపై భట్టి విక్రమార్క క్లారిటీ
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీలు, పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఇన్నాళ్లు అసెంబ్లీ ఉండటం వల్ల హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో పాల్గొనలేకపోయానన్నారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ గురించి సీఎం కేసీఆర్ నిజాలు మాట్లాడారని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరంతో సహా అన్ని ప్రాజెక్టులను సందర్శించబోతున్నట్లు చెప్పారు.
ప్రగతి భవన్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి, కొత్త సచివాలయంను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను వినలేదని వాటిని, వాటిని విన్న తర్వాత తప్పకుండా స్పందిస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే అన్న కేసీఆర్ మాటలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తున్నారని అందువల్ల కాంగ్రెస్ ను బీజేపీని ఏకతాటిపై చూపించడం సరికాదన్నారు. బహుశా ప్రతిపక్షాలను విమర్శించాలి కాబట్టే సీఎం అలా విమర్శించినట్లుగా ఉందన్నారు.