- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగుల్లో భరోసా నింపడానికే ప్రియాంక గాంధీ వచ్చారు.. భట్టి విక్రమార్క
దిశ, వెబ్ డెస్క్: నిరుద్యోగుల్లో భరోసా నింపడానికే ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చారనిసీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యోగాలు లేక రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని వారందరికీ అండగా నిలవడానికే ప్రియాంక గాంధీ ఈనాటి సభకు హాజరయ్యారని తెలిపారు. సోమవారం సరూర్ నగర్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోనియా గాంధీ ఓ తల్లిలా ఆలోచించి ఎన్నో ఏండ్ల కల అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని.. కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే డిమాండ్ తో రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాదయాత్రలో నిరుద్యోగుల బాధలు ప్రత్యక్షంగా చూశానని భట్టి తెలిపారు. ఇవాళ తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని భట్టి కోరారు.