- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Phone Tapping Case: పోలీసులతో మాట్లాడాను.. ఫోన్ ట్యాపింగ్‌పై కుండబద్దలు కొట్టిన చిరుమర్తి లింగయ్య

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణకు హాజరు అవుతానని బీఆర్ఎస్(BRS) నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaiah) స్పష్టం చేశారు. గురువారం ఉదయం నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తప్పకుండా విచారణను ఎదుర్కొంటా.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికిస్తున్నారని మండిపడ్డారు.
‘జిల్లాలో పనిచేసిన పోలీసులతో మాట్లాడి ఉండొచ్చు.. పోలీసు అధికారులు పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం తాను మాట్లాడటం సహజమే’ అని అన్నారు. ఇవాళే విచారణ ఉండటంతో నార్కట్‌పల్లి నుంచి చిరుమర్తి లింగయ్య హైదరాబాద్‌కు బయల్దేరారు. కాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌లో విచారణ ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య కాంటాక్ట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.