CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..! ఎందుకంటే?

by Ramesh N |
CM Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం..! ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy Delhi Tour) రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి లేదా రేపు ఉదయం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనుండగా, 3 వ తేదీతో ప్రచారం ముగుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. కాగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌‌ల అభ్యర్థులు, నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ తరహాలోనే గ్యారెంటీలతో కూడిన హామీలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలపై అక్కడి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. మరోవైపు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్‌డీయే ప్రభుత్వం తరపున ఢిల్లీలో ప్రచారానికి సిద్దమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో తెలుగు రాజకీయ నేతలు ప్రచారం కీలకంగా మారనుంది.


Next Story

Most Viewed