- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cognizant : అమెరికాలో కాగ్నిజెంట్ సీఈవోతో సీఎం రేవంత్ భేటీ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన అమెరికాలో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ బృందంతో భేటీ అయ్యారు. కాగ్నిజెంట్ సీఈవోతో విజయవంతంగా సమావేశాన్ని నిర్వహించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ అంగీకారం చెప్పినట్లు వెలడించారు.
మిలియన్ చదరపు అడుగుల వస్తీర్ణంలో హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కార్యాలయం నిర్మించనుట్లు స్పష్టంచేశారు. దీంతో సుమారు 15 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే, తెలంగాణలోని టైర్-2 నగరాల్లో కంపెనీ ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. దీంతో వారు సానుకూలంగా పరిశీలించేందుకు అంగీకరించారని తెలిపారు. ఈ భేటీలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు ఉన్నారు.