బ్రేకింగ్: MP కోమటిరెడ్డికి షాక్.. సస్పెండ్ చేయాలంటూ థాక్రేకు చెరుకు సుధాకర్ ఫిర్యాదు

by Satheesh |
బ్రేకింగ్: MP కోమటిరెడ్డికి షాక్.. సస్పెండ్ చేయాలంటూ థాక్రేకు చెరుకు సుధాకర్ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షడు చెరుకు సుధాకర్‌ను తను అనుచరులు చంపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సుహాస్ ఫోన్ చేసి నిన్ను, నీ తండ్రిని నా అనుచరులు చంపేస్తారంటూ కోమటిరెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఆడియో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు, సొంత పార్టీ నేత కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వివాదస్పద వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన కోమటిరెడ్డి తాను భావోద్వేగంలో అన్నానని.. ఆ వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ వ్యహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థ్రాకేకు ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేత అయిన కోమటిరెడ్డి తనను చంపుతానని బెదిరించాడని చెరుకు సుధాకర్‌ ఫిర్యాదు చేశారు. ఎంపీ కోమటిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో సుధాకర్ కోరారు. గత కొంత కాలంగా పార్టీ నేతలపై పార్టీకి ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి.. చెరుకును బెదిరించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడిన అతడి చర్యలు తీసుకోని కాంగ్రెస్ అధిష్టానం.. చెరకు సుధాకర్ ఫిర్యాదుతో కోమటిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆస్తకికరంగా మారింది.

Advertisement

Next Story