- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BRS ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు.. రేవంత్ రెడ్డి కలిసిన మరుసటి రోజే షాక్..!
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుపై కేసు నమోదు అయింది. భూమి వివాదంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో ఆయనపై ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 2012లో 2 ఇళ్ల స్థలాలను రెండో సారి అమ్మారని ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లారు. తనను రాథోడ్ బాపురావు మోసం చేశారని ఆరోపించాడు. దీంతో కోర్టు ఆదేశాలతో బాపూరావుతో పాటు సుదర్శన్ అనే వ్యక్తిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ప్రస్తుత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాపురావుకు కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశమై పార్టీలో చేరే విషయాన్ని చర్చించారు. ఇంతలో రాథోడ్ బాపురావు పై చీటింగ్ కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.