టీఎస్ ఎంసెట్‌లో కీలక మార్పులు

by sudharani |
టీఎస్ ఎంసెట్‌లో కీలక మార్పులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ ఎంసెట్-2023 ఎగ్జామ్ పేపర్‌లో జేఎన్‌టీయూ కీలక మార్పులు చేసింది. ఎంసెట్ పరీక్ష పేపర్ ఇంగ్లీష్‌లోనే ఉండాలనే నిబంధనను సడలించింది. ఈ ఏడాది మే 7 నుంచి 11 వరకు జరగనున్న ఎంసెట్ పరీక్షా ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్-ఉర్దూ వెర్షన్‌లలో ఉండనున్నాయి. ఇంతకుముందు ఎంసెట్ కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే నిర్వహించేవారు.

కానీ, ఎంసెట్ వివిధ సెషన్లలో నిర్వహించబడుతున్నందున, ప్రశ్నాపత్రాలు వివిధ క్లిష్ట స్థాయిలలో ఉండే అవకాశం ఉంది. ఈ నేఫథ్యంలో ఏ విద్యార్థికి నష్టం జరగకూడదని ఎంసెట్ 2023లో ప్రత్యేకమైన ఆంగ్ల ప్రశ్నాపత్రాన్ని తీసివేయాలని నిర్ణయించారు. దీంతో, మూడు భాషల్లో నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. కాగా, టీఎస్ ఎంసెట్‌ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఎలాంటి అపరాద రుసుము లేకుండా ఏప్రిల్‌ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Next Story