- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hyderabad: గోషామహల్లో తప్పిన పెను ప్రమాదం.. మరోసారి కుప్పకూలిన చాక్నవాడి నాలా

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గోషామహల్ (Goshamahal) చాక్నవాడి నాలా మరోసారి కుప్పకూలింది. గత మూడేళ్లలో ఇది ఆరోసారి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. (Chaknawadi Nala) చాక్నవాడి మలుపు వద్ద ఇప్పటికే నాలా పై కప్పు నిర్మాణం పనులు జరుగుతోంది. నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు వెళ్లిపోయిన తర్వాత శనివారం రాత్రి ఘటన సంభవించింది. కార్మికులు పనిచేస్తున్న సమయంలో నాలా కూలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు అంటున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ నాలా తరచూ కుంగిపోవడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అతి పురాతన నాలా కావడంతో తరుచూ కప్పు కూలి పోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కూలిన ప్రతిసారి అధికారులు అక్కడి వరకే మరమ్మతులు చేసి వదిలేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ నాలా తరుచూ కులుతుండటంతో స్థానికులు బిక్కు బిక్కుమంటూ భయాందోళనలో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాలా పునర్నిర్మాణం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.